'సాహో' యాక్షన్ పోస్టర్ హంగామా!సాహో బాహుబలి తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమా. భారీ బడ్జెట్ తో.. అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్న సినిమా. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఆగస్టు 30న విడుదల అవడానికి శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సాహో మానియాతో అభిమానులు ఊగిపోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రైలర్లు, టీజర్లు, పోస్టర్లు ట్రెండీగా మారాయి. తాజాగా ఇప్పుడు సాహో నుంచి యాక్షన్ సన్నివేశంతో ఉన్న పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ప్రభాస్, శ్రద్ధాకపూర్ ఇద్దరూ గన్స్ తో ఎటాకింగ్ పొజిషన్ లో ఉన్నట్టున్న ఆ పోస్టర్ కు ట్రెండీ రెస్పాన్స్ వస్తోంది. అన్ని సోషల్ మీడియా వేదికలలోనూ ఈ పోస్టర్ విపరీతంగా హల్ చల్ చేస్తోంది.