హౌస్‌లో జరిగేది ఒకటి... చూపించేది మరొకటి: హేమబిగ్‌ బాస్ తెలుగు సీజన్ త్రీపై సినీ నటి హేమ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫస్ట్‌ వీక్‌లో ఎలిమినేట్‌ అవడంపై తీవ్రంగా స్పందించారు. హౌస్‌లో జరిగేది ఒకటి చూపించేది మరొకటి అంటూ ఆరోపణలు చేశారు. ఆమె బిగ్ బాస్‌ హౌస్‌లో తాను ఉన్నన్ని రోజులు ఏం జరిగిందో మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.