ఐపిఎల్ 2019 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గురువారం జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ పోరాడిన ముంబయి ఇండియన్స్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. రోహిత్ శర్మ (48: 33 బంతుల్లో 8x4, 1x6), హార్దిక్ పాండ్య (32 నాటౌట్: 14 బంతుల్లో 2x4, 3x6) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేయగా.. ఛేదనలో బెంగళూరు హిట్టర్ ఏబీ డివిలియర్స్ (70 నాటౌట్: 41 బంతుల్లో 4x4, 6x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా.. జట్టుని గెలిపించలేకపోయాడు. దీంతో.. బెంగళూరు ఆఖరికి 181/5కే పరిమితమైంది. మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేసి విరాట్ కోహ్లి, హెట్మెయర్, గ్రాండ్‌హోమ్ వికెట్లను పడగొట్టిన ముంబయి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (3/20)కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏబీ డివిలియర్స్ చివరి వరకూ నాటౌట్‌గా ఉండి.. జట్టు ఛేదనలో ఓడిపోడం ఇదే తొలిసారి.
బోణి కొట్టిన ముంబయి ఇండియన్స్....




🎬Related Articles
POLL
