Janavaradhi | Online News


ప్రజల చూపంతా చంద్రబాబు నాయకత్వం వైపే:రాయపాటి


ప్రజల చూపంతా చంద్రబాబు నాయకత్వం వైపే:రాయపాటి
యరపతినేని,వంగవీటిలతో కలసి ప్రచారం.
 
గురజాల,జనవారధి: ఏప్రిల్ 11న జరిగే పోలింగ్ లో ప్రజలంతా పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొని తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ఎంపి రాయపాటి సాంబశివరావు ఓటర్లకు పిలుపునిచ్చారు. మంగళ‌వారం నాడు దాచేపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్థానిక తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి యరపతినేని శ్రీనివాసరరావు,వంగవీటి రాధాలతో కలిసి ప్రచారం నిర్వహించారు.పురవీధుల్లో రోడ్ షో నిర్వహించారు.  ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు.ప్రజల భవిష్యత్తు చంద్రబాబు బాధ్యత అని... ఇదే తమ ఎన్నికల నినాదం అని రాయపాటి తెలిపారు. జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించేందుకు మోదీ, కేసీఆర్, జగన్ లు ఏకమయ్యారని.... వీరి ఉమ్మడి లక్ష్యం రాష్ట్రానికి నష్టం చేయడం మాత్రమే అని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు నాయకత్వం వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. 





POLL