Janavaradhi | Online News


అది... అసాక్ష్యం:యర్రం


అది... అసాక్ష్యం
జగన్ను బ్రష్టు పట్టించాలనుకుంటే నన్ను రెచ్చగొట్టండి
నాపై బురద చల్లితే మీ చరిత్రలు బయటపెడతా
ధైర్యముంటే నిరూపించాలని యర్రం సవాల్
 
సత్తెనపల్లి,జనవారధి::రాంబాబు చరిత్ర,కోడెల బండారం నాకు తెలుసు.మీ గురించి మీ ప్రచారంలో చెప్పుకోండి.నాపై బురద చల్లాలని చూస్తే మీ చరిత్రలు బయటపెడతానంటూ జనసేన అభ్యర్ధి యర్రం వెంకటేశ్వరరెడ్డి ప్రత్యర్ధులను ఘాటుగా హెచ్చరించారు.బుధవారం జనసేన ప్రచారంపై వస్తున్న తప్పుడు ఆరోపణలపై పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ..నాపై నిందలు మోపేవారు నా వ్యక్తిత్వాన్ని గుర్తించుకోవాలన్నారు.నన్ను ఎక్కడ నిలదీశారో చెప్పాలని,రుజువుంటే చూపాలని,మీకు ధైర్యముంటే ఎక్కడైనా ప్రమాణం చేద్ధాం రమ్మని ఆయన సవాల్ విసిరారు.
 

 
జగన్ను బ్రష్టు పట్టించాలనుకుంటే నన్ను రెచ్చగొట్టండని,నిజంగా వైఎస్ పై అభిమానముంటే కట్టుకధలు,తప్పుడు ఆరోపణలు చేయోద్దన్నారు.జనసేనపై దాడుల వెనుక అంబటి ఉంటే సహించేది లేదన్నారు.సిపిఐ నాయకులు నరిశేటి వేణుగోపాల్ మాట్లాడుతూ జనసేన ప్రచారాన్ని అడ్డుకోవాలని చూస్తే మీరు ఏ గ్రామంలోనూ తిరగలేరని,ప్రత్యర్ధులు ఇది గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు.యర్రం మానవత్వమున్న మనిషన్నారు.రెచ్చగొట్టే విధంగా రాజకీయాలు చేయటం సరికాదన్నారు.సమావేశంలో వారితో పాటు సిపిఎం నాయకులు పెండ్యాల మహేష్,తదితరులున్నారు.
 





POLL