Janavaradhi | Online News


బాబును నమ్మొద్దు..జగన్


బాబును నమ్మొద్దు..జగన్
చీరకు రూ.3వేలకు మోసపోవద్దు
మాఫీ పేరుతో రైతులకు అన్యాయం
ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన వైనం
ఎల్లో మీడియాను ఉతికారేసిన వైకాపా అధినేత జగన్
అంబటి,లావులను గెలిపించండని విజ్ఞప్తి
 
సత్తెనపల్లి,మేజర్ న్యూస్:చంద్రబాబు పాలనలో ఐదేళ్ళపాటు అవినీతి దౌర్జన్యాలను చూశాం.మోసపూరిత మాటలు,పచ్చి అబద్దాలను విన్నాం.ఇక నమ్మోద్దు.బాబు పాలనను నమ్మోదు.చీరకు మూడు వేలకు మోసపోవద్దంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చంద్రబాబుపై మండిపడ్డారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గుంటూరు జిల్లా, సత్తెనపల్లిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.
 
ఎన్నికల ముందు చంద్రబాబు తమ పథకాలను కాపీ కొట్టి మరోసారి మోసం చేయడానికి సిద్దమయ్యారన్నారు. పసుపు కుంకుమ పథకానికి మోసపోవద్దని, అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. 
చంద్రబాబు ఐదేళ్ల పాలనపై చర్చ జరిగితే డిపాజిట్లు రావని, ప్రతి రోజు ఓ పుకారు పుట్టించి ఈ ఎల్లో మీడియా ప్రచారం చేస్తుందని, ఈ ఎల్లోమీడియా మాయలో పడొద్దని ప్రజలను కోరారు.
 
అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంబటి రాంబాబు‌‌, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు.
 
 
అంబటి మాట్లాడుతూ..సత్తెనపల్లి నియోజకవర్గాన్ని ఐదు సంవత్సరాలపాటు అధోగతి పాలు చేశారు.దౌర్జన్య పూరితంగా దోచుకున్నారు.అరాచకపాలనకు అరికట్టండి.నాకు ఓటు వేసి గెలిపించి జగన్ కి తోడుగా అసెంబ్లీకి పంప‍ండని అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు.రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని నమ్ముకుని రాజకీయాల్లో కొనసాగుతున్నానన్నారు.సుస్ధిర పాలన అందిస్తానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని జ్గన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని ఆయన కోరారు.
 
కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరరెడ్డి,అంబటి మురళి,పట్టణ పార్టీ అధ్యక్షులు నాగుల్ మీరాన్,సయ్యద్ మాబు,ఆతుకూరి నాగేశ్వరరావు,చల్లంచర్ల సాంబశివరావు,మక్కెన అచ్చయ్య,గీతా హసంతి,అచ్యుత శివప్రసాద్ తదితరులున్నారు.





POLL