Janavaradhi | Online News


అభివృద్ధి చేశాం ఆదరించండి:రాయపాటి


అభివృద్ధి చేశాం ఆదరించండి:రాయపాటి
మాదలలో ప్రచారంలో కోడెల,రాయపాటి
 
ముప్పాళ్ళ,జనవారధి:రాష్ట్ర విభజన అనంతరం లోటు బడ్జెట్ ఉన్నరాష్ట్రాన్ని చంద్రబాబు రాజకీయ అనుభవంతో, అపార మేధాశక్తితో, కేంద్ర  సహాయ సహకారాలు లేనప్పటికీ అభివృద్ధి పథంలో నడిపారని రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు. నిరంతరం ప్రజా శ్రేయస్సుకు కృషి చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు.బుధవారం ఆయన డాక్టర్ కోడెల శివప్రసాద్ తో కలిసి సత్తెనపల్లి  నియోజకవర్గంలోని ముప్పాళ్ళ మండలం మాదల గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ఎంపి రాయపాటి మాట్లాడుతూ.. సభాపతిగా డాక్టర్ కోడెల శివప్రసాద్ వందల కోట్ల రూపాయల నిధులతో సత్తెనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని పేర్కొన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణం చేయడంలో భారతదేశంలోనే  ఆదర్శంగా నిలిచారని రాయపాటి కొనియాడారు. దశాబ్దాల కాలం నుండి వెనుకబడ్డ పల్నాడు ప్రాంతానికి దాహార్తిని తీర్చేందుకు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు వినుకొండ మాచర్ల గురజాల నియోజకవర్గాలలో మూడు వాటర్ గ్రిడ్ ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.
 
సత్తెనపల్లిలో కేంద్రీయ విద్యాలయం మంజూరు, సత్తెనపల్లి- క్రోసూరు రహదారిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి 70 కోట్లు మంజూరు తాము సమిష్టిగా కృషి చేశామని పేర్కొన్నారు. పార్లమెంటు నియోజకవర్గాన్ని తాము అభివృద్ధి పథంలో నడిపామని, సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో తమను ఆదరించాలని రాయపాటి సాంబశివరావు ప్రజలకు విన్నవించారు.





POLL