Janavaradhi | Online News


ఆ విమర్శలపై స్పందిచాల్సిన అవసరం లేదు:రాయపాటి


నరసరావుపేట‌,జనవారధి: రాజకీయ అవహాగాహన,పరిపక్వత లేని కారణంగానే తన ప్రత్యర్థి లావు కృష్ణదేవరాయలు తనపై విమర్శలు చేస్తున్నారని,ఆ విమర్శలకు స్పందిచాల్సిన అవసరం లేదని ఎంపీ రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..తానూ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలియకపోవటం అతని అవివేకానికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా రాయపాటి గత ఐదేళ్ళలో చేపట్టిన పలు  అభివృద్ధి కార్యక్రమాలను మీడియాకు వివరించారు.

 

అందులొ ముఖ్యమైనవి..దుర్గి మండలం ధర్మవరం దత్తత, రూ.10 కోట్లతో 100 ఎకరాల చెరువు సిమెంట్ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, 36 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు,వినుకొండ, మాచర్ల మరియు గురజాల నియోజకవర్గాల్లో 600 కోట్లతో మూడు వాటర్ గ్రిడ్లు ఏర్పాటు,అనుపు, కొప్పునూరు ఎత్తిపోతల పథకం 100 కోట్లు,పదివేల ఎకరాల సాగు,దుర్గిలో పూర్తి అయిన మార్కెట్ యార్డు నిర్మాణం,వినుకొండ, మాచర్ల,పిడుగురాళ్ల పట్టణాల్లో 312 కోట్లతో మంజూరైన త్రాగునీటి పధకాలు.

 

అలాగే చిలకలూరిపేట పట్టణంలో 139 కోట్లతో త్రాగునీటి పధకం మంజూరు( పధకం పూర్తి.),దేశంలోని ప్రఖ్యాత కంపెనీలనుండి 30 కోట్ల సి ఎస్ ర్ నిధులు మంజూరు.,సత్తెనపల్లి - క్రోసూరు మార్గంలో 70 కోట్లతో రైల్వే బ్రిడ్జి మంజూరు.నరసరావుపేటలో జె ఎన్ టియు,పేరేచెర్ల – కొండమోడు రోడ్డు 4 వరుసలుగా విస్తరణ,సత్తెనపల్లి, చిలకలురిపేట ల్లో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు,వైకుంఠపురం నుండి నకరికల్లు వరకు పెన్నా నధుల అనుసంధానం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సంగతి అందరికి తెలుసన్నారు.

POLL