Janavaradhi | Online News


కోడెలను అఖండ మెజార్టీతో గెలిపించండి:నారా రోహిత్


భారీ మెజార్టీతో గెలుపు తధ్యం:కోడెల‌
కోడెలను అఖండ మెజార్టీతో గెలిపించండి:నారా రోహిత్
తెదేపాను ఓడించేందుకు గుంటనక్కలు ఎదురుచూపు
ప్రజల ఆశీసులతో చంద్రబాబు సిఎం ఖాయం
 
సత్తెనపల్లి,జనవారధి:వెనుకబ‌డిన‌ నియోజకవర్గాన్ని కేవలం ఐదేళ్ళ పాలనలో వందల కోట్లతో అభివృద్ధి చేసిన సందర్భాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకున్నారని,ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ మెజార్టీతో తన గెలుపు తధ్యమని స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన స్పీకర్ కోడెల,సినీ హీరో నారా రోహిత్ కలసి నకిరికల్లు మండలంలోపర్యటించారు.
 
ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్ళాడుతూ..తెలుగుదేశం పార్టీని ఓడించేందుకు ఒకపక్క ప్రధాని మోదీ,మరోవైపు తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ గుంటనక్కల్లా ఎదురుచూస్తున్నారని,ప్రజాశీస్సులు నిండుగా ఉన్న చంద్రబాబును ఓడించటం ఎవ్వరితరం కాదని  పేర్కొన్నారు.ఆయన మాట్లాడుతూ..రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పధంలో నడిపిన చంద్రబాబుకు మరో అవకాశమివ్వాలన్నారు.నవ్యాంధ్ర రాజధాని అభివృద్ధి ఒక్క చంద్రబాబుకే సాధ్యమన్నారు.
 
అభివృద్ధిని అడ్డుకోవటం,దోచుకోవటం మాత్రమే జగన్ కు తెలుసునన్నారు.సత్తెనపల్లిని అభివృద్ధి,సంక్షేమంలో అగ్రపధాన నిలిపిన కోడెల శివప్రసాదరావును ప్రజలు ఆదరించాలని కోరారు.కాగా ఆయా ప్రాంతాల్లో జరిగిన ప్రచారానికి స్ధానికుల నుండి పెద్ద ఎత్తున స్పందన లభించింది.అడుగడుగునా పూల వర్షం కురిపించారు.కోడెలను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. .జై కోడెల..జై జై కోడెల అంటూ దారిపొడవునా వారు నినాదాలు చేశారు.





POLL