Janavaradhi | Online News


మాకు అవమానం జరగలేదు


మాకు అవమానం జరగలేదు
ఆ వార్తలు అవాస్తవం
 
సత్తెనపల్లి,జనవారధి: జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనలో స్ధానిక ఆర్యవైశ్య నాయకులకు అవమానం జరిగిందన్న వార్తలు పట్టణంలో తీవ్ర దుమారం లేపిన‌ నేపధ్యంలో ఆ పార్టీ ఆర్యవైశ్య నాయకులు స్పందించారు.శుక్రవారం స్ధానికంగా జరిగిన ఓ సమావేశంలో వారు మాట్లాడుతూ మాకు అవమానం జరిగిందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని,అలాంటి సంఘటనలేవి జరగలేద‌న్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీక్కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే కావాలని గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.అంబటికి ఆర్యవైశ్యులంటే అంబటికి అమితమైన ప్రేమాభిమానలు కలిగియున్నాయని పేర్కొనారు.రాంబాబుపై తప్పుడు ప్రచారం చేస్తే ఆర్యవైశ్యులందరు సంఘటితంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.కార్యక్రమంలో చల్లంచర్ల సాంబశివరావు,వెలుగూరి శరత్ బాబు,ఆతుకూరి నాగేశ్వరరావు,అచ్యుత శివప్రసాదరావు,ఆకుతోట దుర్గారావు,గుంటూరు సుషీంద్ర తదితరులున్నారు.





POLL