Janavaradhi | Online News


రాయపాటి చొరవ: సిఎంని కలసిన మాజీ ఎమ్మెల్యే వీరపనేని


రాయపాటి చొరవ: సిఎంని కలసిన మాజీ ఎమ్మెల్యే వీరపనేని
గెలుపుకు సహకరించండి:సిఎం
వీరపనేని చేరికతో పార్టీ మరింత బలోపేతం
 
అమరావతి,జనవారధి:క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే వీరపనేని యలమందరావు విషయంలో ఎంపి రాయపాటి సాంబశివరావు చొరవ చూపారు.2004లో వీరపనేనికి  తెలుగుదేశం పార్టీ టిక్కెట్ లభించకపోవటంతో ఆయన కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.ప్రస్తుత ఎన్నికల్లో వీరపనేని క్రియాశీలంకా పనిచేస్తే తెదేపా గెలుపుకు లాభం చేకూరుతుందన్న కార్యకర్తల విజ్ఞప్తి మేరకు రాయపాటి తన చాణిక్యం ప్రదర్శించి,వీరపనేనికి ఒప్పించి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకెళ్ళటం జరిగింది.
 
గెలుపుకు సహకరించండి:సిఎం
రాయపాటి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేసిన వీరపనేనిని రాయపాటి శుక్రవారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద‌కు తీసుకువెళ్ళారు.ఈ సందర్భంగా చంద్రబాబు యలమందరావుకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.క్రియాశీలకంగా పనిచేసి వినుకొండలో మంచి మెజారిటీ తీసుకురావాలని ఆదేశించారు. ఆయనకు సముచిత పదవిని కేటాయిస్తామని మఖ్యమంత్రి హామీ ఇచ్చారు. యలమందరావు చేరిక తెలుగుదేశం పార్టీ తిరిగి మరింత బలోపేతం అవుతుందని రాయపాటి వ్యాఖ్యానించారు.





POLL