Janavaradhi | Online News


వ్యక్తిగతంగా విమర్శిస్తే సహించేది లేదు:యర్రం


సత్తెనపల్లి,జనవారధి:తన పదేళ్ల పాలనలో ఎటువంటి అవినీతి జరగకపోవటంతో ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థులు తనపై వ్యక్తిగతంగా విమర్శలు  చేస్తున్నారని,తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయటానికి “వందల  కోట్లు దోచామా?, కుటుంబ పాలన చేశామా?ఎం చేశామని తనపై బురద జల్లుతున్నారని జనసేన అభ్యర్థి యర్రం వెంకటేశ్వరరెడ్డి  మండి పడ్డారు.కేవలం ఓటమి భయంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని,వారిని బహిరంగంగా ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేసి  వాటిని తిప్పికొట్టడంతో మిన్నకుండిపోయారని యర్రం పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బలిజేపల్లి,గణపవరం,ఉప్పలపాడు,రెడ్డిగూడెం,మొక్కపాడు,ఆర్ఆర్ సెంటర్,రాజుపాలెం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.ఆయా గ్రామాల్లో యర్రం మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులను పరిశీలించి ఎవరు మంచివారో పోల్చుకుని వారినే ఎన్నుకోండని తెలిపారు.ప్రజలు మార్పును ప్రోత్సహించాలని,ఎన్నికల్లో డబ్బు,మద్యం పంచకుండా రాజకీయాలలో సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టిన తనను ఆదరించాలని ప్రజలను కోరారు.ఆయా గ్రామాల్లో నిర్వహించిన ప్రచారానికి స్ధానికుల నుండి విశేష స్పందన లభించింది.ఆయనతో పాటు తాళ్లూరి మోహన్బాబు,తవిటి భావన్నారాయణ,శివ పార్వతి, సిపిఎం.సిపిఐ,బీఎస్పీ,పార్టీల నాయకులు,జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.  





POLL