Janavaradhi | Online News


చంద్రబాబు తోనే భవిష్యత్తు,భరోసా: రాయపాటి


సత్తెనపల్లి,జనవారధి:నవ్యాంధ్ర సృష్టికర్త నారా చంద్రబాబునాయుడుతోనే రాష్ట్ర భవిష్యత్తు, ప్రజలకు భరోసా అని ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్ మమత పేర్కొన్నారు. ఆదివారం సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ళ మండలం ఇరుకుపాలెం, నార్నెపాడు గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  రాష్ట్రంలో చంద్రబాబు యువతకు,మహిళలకు పెద్ద పీట వేసి వారిని ఆర్థికంగా పైకి తీసుకు వచ్చేందుకు ఎనలేని కృషి చేశారని ఆమె పేర్కొన్నారు.

 

రాజధాని లేని రాష్ట్రంగా మొదలై నేడు అనేక రంగాల్లో అభివృద్ధికి చిరునామాగా మారింది అంటే అది చంద్రబాబు నాయుడు గొప్పతనమన్నారు.  పాలన పట్ల ఆయనకున్న పట్టుదల వల్ల ఇవన్నీ సాధ్యం అయ్యాయని కేవలం అభివృద్ధికే కాక, సంక్షేమానికి కూడా పెద్ద పీట వేసిన ఘనత చంద్రబాబునాయుడుకె దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని అనేక గ్రామాల్లో త్రాగునీరు మరియు సిమెంట్ రోడ్లు ఏర్పాటుకు ఎంపీ రాయపాటి కృషి చేశారని, అలాగే సత్తెనపల్లి కి అభివృద్ధి అంటే ఏమిటో చూపించిన నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు అని ఆమె తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపుకై సైకిల్ గుర్తు పై ఓటు వేసి అఖండ మెజారిటీని కట్ట పెట్టవలసిందిగా ఓటర్లను ఆమె కోరారు .





POLL