Janavaradhi | Online News


వైకాపా నేత అంబటిపై మండిపడ్డ యర్రం


రేపల్లె నుండి వచ్చి ఇక్కడ పోటీ చేయొచ్చా..?
జనసేన తరుపున నేను పోటీ చేయకూడదా..?
మీలా పార్టీ మారే హక్కు మాకు లేదా..?
దాడులను ఖండించకపోవటంపై కారణమేంటి..?
వైకాపా నేత అంబటిపై మండిపడ్డ యర్రం 
 
సత్తెనపల్లి,జనవారధి:ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి ఎలా మారాడు..?రేపల్లె నుండి వచ్చి సత్తెనపల్లిలో ఎలా పోటీ చేస్తున్నాడు..?ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ నుండైనా పోటీ చేసే హక్కు మాకు లేదా..?లోపాలుంటే చెప్పండి..?అక్రమంగా ఆస్ధులు సంపాదించుకుంటే విమర్శించండి..?అంతేగాని పార్టీ తరుపున చేసుకుంటున్న ప్రచారాన్ని ఇబ్బంది పెట్టటం,మీ నాయకులచేత,కార్యకర్తల చేత దాడులు చేయించటం సరైన పద్దతి కాదని,మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి యర్రం వెంకటేశ్వరరెడ్డి వైకాపా నేత అంబటిని తీవ్రంగా హెచ్చరించారు.సోమవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు రెచ్చగొడుతున్నారని,కులాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదన్నారు.
 
దమ్మాలపాడులో అంబటి మాట్లాడుతూ ..మరో రూపంలో ఎన్నికలకు వచ్చాడు ..మళ్ళీ మనల్ని ఇబంది పెడుతున్నాడంటూ అంబటి మాట్లాడటం విడ్డురంగా ఉందన్నారు.నాకు పోటీ చేసే అర్హత లేదా..?అని ప్రశ్నించారు.నమ్మకంగా నా చుట్టూ ఉన్న వ్యక్తులు అనేక సూచనలిచ్చారని,జనసేనలో చేరితే ఎంత మంది నావైపు నిలబడతారో తేల్చుకొనేందుకే పోటీలో ఉన్నారన్నారు.ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి షేక్ నాయబ్ కమల్ మాట్లాడుతూ పట్టణంలోని ముస్లిం వార్డులో ప్రచారం చేశామన్నారు.నేటికీ ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని విమర్శించారు.25 ఎంపీ స్ధానాలున్న మన రాష్ట్రంలో ఒక్క సీట్  కూడా రెండు పార్టీలు ముస్లిలకు కేటాయించకపోవటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సమావేశంలో తాళ్లూరి మోహన్ బాబు,పెండ్యాల మహేష్,వాకుమళ్ళ చెంచిరెడ్డి,తవిటి భావన్నారాయణ,సిరిగిరి మణికంఠ,సిపిఎం,సిపిఐ,బీఎస్పీ నాయకులూ,కార్యకర్తలు తదితరులున్నారు.  





POLL