Janavaradhi | Online News


రికార్డుస్థాయిలో మహర్షి ప్రీరిలీజ్ బిజినెస్.....


భరత్ అనే నేను సినిమా సక్సెస్ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం మహర్షి. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్, పీవీవీ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. ఈ సినిమా గురించి ఇటీవల దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు సినిమా తెరపై అద్భుతంగా మే 9న ఆవిష్కరించడం ఖాయం అని వెల్లడించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికరమైన వార్త మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే...
 
పూజా హెగ్డే, అల్లరి నరేష్ లాంటి క్రేజీ యాక్టర్లతో మహర్షి చిత్రాన్ని సుమారు రూ.70 కోట్ల వ్యయంతో 150 రోజుల్లో తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై మరింత హైప్ పెంచింది. ఈ క్రమంలో ఈ సినిమా రూ.100 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని టాక్. టాలీవుడ్ రేంజ్ పెరిగిందనడానికి ఇది ఉదాహరణ అని సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి. మహేష్ బాబు సినిమా 100 కోట్ల రూపాయలకుపైగా బిజినెస్ చేయడం రికార్డుగా చెప్పుకొంటున్నారు. థియేట్రికల్ రైట్స్ రూ.90 కోట్లకు అమ్మడం జరిగిందనేది ట్రేడ్ రిపోర్టు. శాటిలైట్ హక్కులను భారీ ధర చెల్లించి జెమినీ టెలివిజన్ సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. ఇలా వంద కోట్ల బిజినెస్ చేయడం ఇది మూడోసారి. ప్రిన్స్ గత చిత్రం భరత్ అనే నేను రూ.102 కోట్ల బిజినెస్ చేయడం గమనార్హం.
 
 





POLL