Janavaradhi | Online News


సత్తెనపల్లిలో అంబటి గెలవడు:పవన్


సత్తెనపల్లిలో అంబటి గెలవడు:పవన్ 
కేసీఆర్ చెప్తే జగన్ సీఎం అవుతారా.?
 
గుంటూరు,జనవారధి:సత్తెనపల్లిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంబటి రాంబాబు గెలవడు..ఇదేదో ప్రతిపక్షాలు చెప్తోన్న మాట కాదు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న హెచ్చరిక.ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ సామజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.అంబటిపై పిడుగులా ఆయన మాటలు పడ్డాయనటంలో ఆశ్యర్యం లేదు.పవన్ మాటల్లో వాళ్ళు పెళ్ళికి పిలిస్తే వెళ్తాను,వాళ్ళ పిల్లల్ని గౌరవిస్తాను.అది నేను నేర్చుకున్న సంస్కృతీ.దీన్ని అడ్డంపెట్టుకుని పవన్ నేను చెప్తే వింటాడు.
 
అందుకే సత్తెనపల్లి రాలేదు అని అంబటి రాంబాబు మాట్లాడటం సరైన పద్దతి కాదు.నన్ను రాజకీయాలకు వాడుకోవటం మంచిది కాదు.మీరు ఎలా గెలుస్తారనుకుంటున్నారు..?గెలిచేది జనసేనే.ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది జనసేనే.కేసీఆర్ చెప్తే జగన్ ముఖ్యమంత్రి అవుతాడా..?ఎం పోయిన సారి చెప్పాడుగా ఎందుకు కాలేదు.తిరుమలను అపవిత్రం చేసిన వాడు ఎన్నటికీ ముఖ్యమంత్రి కాలేడంటూ వీడియోలో పవన్ కళ్యాణ్ మాట్లాడటం సంచలనమయ్యింది.   

POLL