Janavaradhi | Online News


లోకల్ హీరో ఆర్కేను గెలిపించండి


కుంభకోణాలకు కేంద్రం మంగళగిరి 
లోకల్ హీరో ఆర్కేను గెలిపించండి 
క్యాబినెట్ లో మంత్రిగా ఉంటాడు :జగన్ 
 
మంగళగిరి; జనవారధి :చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిని ప్రతి కుంభకోణం.. మోసం.. వంచన అన్ని మంగళగిరి కేంద్రంగానే జరిగాయని,టీడీపీ పాలనలో చుట్టు పక్కల రైతులకు రక్షణ లేదని,ఇష్టానుసారం భూములను ఆక్రమిస్తున్నారని,చంద్రబాబును ఓడించాలని రాష్ట్రమంతా నిర్ణయించుకుందని, ఆయన సుపుత్రుడు లోకేష్‌ను కూడా ఓడించాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. మంగళవారం గుంటూరుజిల్లా మంగళగిరిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ...ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, ఆయన పార్టనర్‌.. ఎల్లో మీడియా చేసే కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారంలోకి రాగానే చేనేత వర్గానికి చెందిన వారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని, నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని హామీ ఇచ్చారు. 
 
మీరు ఓటేస్తే ఆర్కే మంత్రవుతాడు:
నా సోదరుడు.. లోకల్‌ హీరో ఆర్కే గత ఐదేళ్లుగా మీ కోసమే పనిచేస్తున్నాడు. ఆర్కేకు ఓటేస్తే.. మీ ఆస్థులను కాపాడుతాడు.. మీ కుటుంబాలను అభివృద్ధి చేస్తాడు.. నా కేబినేట్‌లో మంత్రిగా ఉంటాడు’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు.
మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆళ్ల రామకృష్ణ రెడ్డి (ఆర్కే)తో పాటు గుంటూరు లోక్‌సభ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డిలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే..
 
అన్ని అక్రమాలు ఇక్కడే..
మంగళగిరిలోనే హాయ్‌ల్యాండ్‌, సింగపూర్‌ కుంభకోణం.. రిషితేశ‍్వరి మరణం, సదావర్తి భూముల కుంభకోణం. మూడు సెంటిమీటర్ల వర్షం పడితే లోపల 6 సెంటీమీటర్ల నీరు కనబడే టెంపరరీ సెక్రటిరియేట్, అసెంబ్లీ‌. అరటి తోటలను తగల బెట్టించింది. చంద్రబాబు అక్రమ నివాసం ఇక్కడే.. ఈ మంగళగిరిలోనే. ఇక్కడి నేతన్నలను వంచించింది. మేనిఫెస్టోలోచెప్పింది ఒక్కటి కూడా చేయనిది. స్వర్ణకారుల ఆత్మహత్యలు కూడా ఇక్కడే. రైతులను, కూలీలను మోసగించింది ఇక్కడే. దళితుల అసైన్డ్‌ భూములు లాక్కుంది ఇక్కడే. ల్యాండ్‌పూలింగ్‌ బాధితులకు ప్లాట్‌లు ఇవ్వలేదు కానీ.. ఆయన బీనామిలుకు ఇచ్చింది ఇక్కడే. కృష్ణానది పక్కనే ఉన్నా సాగు నీరు అందించలేని అధ్వాన్నమైన పరిస్థితి ఇక్కడే. కూతవేటులో సీఎం నివాసం.. పక్కనే ఇసుక దోపిడి. సీఎం ఆయన కొడుకు ఏనాడు మంగళగిరిలో తిరిగినది లేదని విమర్శించారు.





POLL