Janavaradhi | Online News


ప్రత్యర్థులెవరైనా గెలుపే లక్ష్యంగా పనిచేసాం


జనసేన పార్టీకే జనం బ్రహ్మరథం
ప్రత్యర్థులెవరైనా గెలుపే లక్ష్యంగా పనిచేసాం 
అత్యధిక మెజార్టీతో విజయం ఖాయం:
సత్తెనపల్లి జనసేన అభ్యర్థి యర్రం వెంకటేశ్వరరెడ్డి  
 
సత్తెనపల్లి,జనవారధి:మార్పు కోసం వ‌చ్చిన జ‌న‌సేన పార్టీకే నియోజకవర్గ ప్రజలు బ్ర‌హ్మ‌ర‌థం పడతారని, సత్తెనపల్లిలో  జ‌న‌సేన‌, బీఎస్పీ, సిపిఐ, సిపిఎంల కూట‌మిల సమిష్టి కృషితో  అత్యధిక ఓట్ల మెజార్టీతో తాను విజయం సాధించటం ఖాయమని  ఆ పార్టీ అభ్యర్థి యర్రం వెంకటేశ్వరరెడ్డి అన్నారు.ప్రచారం ముగిసింది.ఎన్నికల పోలింగ్ కు ఒక్కరోజు మాత్రమే సమయముంది.ఈ నేపథ్యంలో మంగళవారం జనవారధి ప్రతినిధితో ఆయన మాట్లాడారు.ఆయన మాట్లాడుతూ..సత్తెనపల్లిలో ప్రత్యర్థులెవరైనా గెలుపే లక్ష్యంగా పనిచేశామన్నారు.ఒకరి గెలుపు కోసమో,మరొకరి ఓటమి కోసమే పనిచేయలేదని స్పష్టం చేశారు.
 
ఎక్కడినుండో వచ్చి,పార్టీలు మారి, ఇక్కడ పోటీ చేస్తున్న వారు తనని విమర్శించటం హాస్యాస్పదమన్నారు.ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడ నుండైనా..ఏ ఆపార్టీ నుండైనా పోటీ చేసే హక్కు అందరికి ఉందన్నారు.జనసేనకు గ్రామాల్లో మంచి ఆదరణ లభిస్తోందని,ప్రజలు మార్పు కోరుకుంటున్నారని దానికి ఉదాహరణ ఈ ఎన్నికలే అన్నారు. జ‌న‌సేన అధ్య‌క్షులు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ని ముఖ్య‌మంత్రిగా చూడాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని, ఏపీకి యువ ముఖ్య‌మంత్రిగా పవన్  అయి తీరుతార‌ని చెప్పారు.ప‌వ‌న్‌ మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తార‌న్న న‌మ్మ‌కం ఉందన్నారు. నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేసే ఆయ‌న ప్ర‌జ‌ల అన్ని ర‌కాల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గం చూపుతార‌న్న భ‌రోసా ఉందని పేర్కొన్నారు.
 
రాజకీయాల్లో మార్పు కోసం జ‌న‌సేన‌కే ఓటు వేయండి. గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించండ‌ని ప్రజలను  కోరారు.చివరగా..ప్రధాన పార్టీలు ఏ సభ పెట్టిన..ఏ రోడ్ షో చేసిన జనాలు వస్తున్నారని,దాంతో  తమ గెలుపు ఖాయం అంటున్నారు. కానీ పోలింగ్ బూతు కు వచ్చిన జనాలు మాత్రం జనసేనకే బ్రహ్మరధం పడతారని,ముగ్గురిలో మెరుగైన తనకే ఓటేస్తారని యర్రం వెంకటేశ్వరరెడ్డి తన గెలుపుపై ధీమా వ్యక్తం చేసారు.





POLL