Janavaradhi | Online News


రేపటితో ముగియనున్న సహస్ర చంఢీ యాగం


రేపటితో ముగియనున్న సహస్ర చంఢీ యాగం 
జగన్ సీఎం కావాలన్నదే ఆరిమండ సంకల్పం  
 
గుంటూరు,జనవారధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆరిమండ వరప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన సహస్ర చంఢీ రాజశ్యామల యాగం రేపటితో పూర్తవుతుంది.సత్తెనపల్లి మండలం కంటిపూడి నలంద ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో జగన్ సీఎం అయ్యేందుకు ఏప్రియల్ 1 న ప్రారంభం అయిన ఈ యాగం 11 రోజుల పటు 54 మంది రుత్వికులతో,వేదం మంత్రాలతో నిర్విఘ్నంగా కొనసాగుతుంది.
 
 
ఈ సందర్భగా ఆరిమండ మాట్లాడుతూ ..ప్రజల్లో మార్పు రావాలని,సమర్ధవంతమైన నాయకుడు జగన్  ఆంధ్రప్రదేశ్ కు సీఎం కావాలన్న ఆకాంక్షతో హైదరాబాద్ లో జులై 23 ,2017 లో స్టార్ట్ చేసిన యాగం..ఎలక్షన్ పూర్తయ్యి రిజల్ట్ వచ్చి సీఎంగా ప్రమాణస్వీకారం చేసే వరకు కొనసాగుతుందని ఆరిమండ వివరించారు.
 

 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న పార్లమెంట్,అసెంబ్లీ అభ్యర్థులు గెలుపొందాలని వారి  గోత్ర నామాలతో ప్రతి రోజు పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు.జగన్ సీఎం కావటం తన ప్రగాఢ సంకల్పమని,ఆయన సీఎం హోదాలో పూర్ణాహుతికి  హాజరవుతారని  ఆరిమండ పేర్కొన్నారు.
 
  





POLL