Janavaradhi | Online News


ఎవ్వరిని వదలను - రీపోలింగ్ జరపాలి:కోడెల


ఎవ్వరిని వదలను - రీపోలింగ్ జరపాలి:కోడెల 
 
సత్తెనపల్లి,జనవారధి: 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నడూ నాపై దాడి జరగలేదని, నిన్న ఇనిమెట్లలో జరిగిన దాడి కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల హత్య రాజకీయాలు,దౌర్జ్యనాలకు నిదర్శమని స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు.శుక్రవారం స్ధానిక సభాపతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
 
ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ పై పక్షపాత ధోరణితో వ్యవహరించిందని మండిపడ్డారు.సరిపడా  కేంద్ర బలగాలను పంపించకుండా ప్రజాస్వామ్యాన్ని ఆపగస్యం చేసిందన్నారు.ఇది పూర్తిగా ఎలక్షన్ కమిషన్,పోలీసుల వైఫల్యమేనాని స్పష్టం చేసారు.వైకాపా నాయకులూ అంబటి రాంబాబు,బసు లింగారెడ్డి,రాజనారాయణలు జగన్ ఆదేశాల మేరకే తనపై దాడి చేసారని ఆరోపించారు.దాడి జరిగిన సమయంలో వ్యక్తిగత భద్రతా సిబ్బంది కాల్పులకు సిద్ధపడ్డ తానే వారించానని,అయినా రౌడీ మూకలు తనపై,తన కారుపై రాళ్లతో దాడి చేసి కారును ధ్వసం చేసారని వివరించారు.
 
ఇనిమెట్లలో రీపోలింగ్ జరపాలని,పోలింగ్ బూత్ లలో విధులు నిర్వహిస్తున్న అధికారులు వైకాపా నాయికలకు సహకరించారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీనేనని,ఎవ్వరిని వదిలేది లేదని హెచ్చరించారు.





POLL