Janavaradhi | Online News


ఎన్ని కుట్రలు పన్నిన విజయం మనదే: కోడెల


సత్తెనపల్లి,జనవారధి: ప్రతిపక్ష వైకాపా నాయకుడు అంబటి రాంబాబు ఎన్ని కుట్రలు పన్నినా విజయం తెలుగుదేశం పార్టీదేనని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలో గురువారం తనపై జరిగిన దాడి అనంతరం తనను చూసేందుకు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని తన కార్యాలయంలో వచ్చిన అభిమానులను ఉద్దేశించి స్పీకర్ డాక్టర్ కోడెల మాట్లాడారు. క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమన్వయంతో వ్యవహరించి నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ శాతం జరగడానికి కృషిచేశారని కొనియాడారు.ఇందుకు ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని కోడెల పేర్కొన్నారు.

రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని సీఎం గా చంద్రబాబునాయుడు ప్రజలకు సేవలు అందిస్తారని అన్నారు. అత్యధిక మెజార్టీ వస్తే సత్తెనపల్లిలో మరోసారి చరిత్ర సృష్టించే అవకాశం ఉందన్నారు.సత్తెనపల్లి పట్టణంతో పాటుగా నెకరికల్లు, ముప్పాళ్ళ, సత్తెనపల్లి, రాజుపాలెం మండలాల్లోని గ్రామాలనుండి పెద్దఎత్తున తనకు మద్దతుగా తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలందరికీ స్పీకర్ డాక్టర్ కోడెల కృతజ్ఞతలను తెలియజేశారు.

POLL