Janavaradhi | Online News


ఇంటర్లో భవిష్య విద్యార్థుల ప్రభంజనం


ఇంటర్లో భవిష్య విద్యార్థుల ప్రభంజనం 
పదికి పది సాధించిన విద్యార్థిని ఆసియా 
 
సత్తెనపల్లి,జనవారధి: పట్టణంలోని భవిష్య జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో ప్రభంజనం సృష్టించారు.ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాలను పాయింట్ల వారీగా ప్రకటించింది.భవిష్య కళాశాల సీనియర్ ఎంపీసీ విద్యార్థిని ఎస్ కె ఆసియా పదికి పది పాయింటు సాధించి రాష్ట్ర స్ధాయిలో కళాశాల ప్రతిభను ఇనుమడింపజేసింది.మరో పన్నెండు మంది విద్యార్థులు 9 . 5 పాయింట్లకు పైగా సాధించి పట్టణంలో సంచలనం సృష్టించారు.జూనియర్ ఇంటర్ ఫలితాలలో పదకొండు మంది విద్యార్థులు 9 . 4 కి పైగా ఫలితాలు సాధించారని భవిష్య స్ఫూర్తి కళాశాల డైరెక్టర్ ఇమడాబత్తుని శ్రీధర్ శుక్రవారం తెలిపారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ మంది విద్యార్థులతో,అత్యుత్తమ పర్యవేక్షణతో నాణ్యమైన విద్యాబోధన అందించటమే భవిష్య ప్రధమ స్ధానంలో నిలవటానికి కారణమన్నారు.కళాశాల సిబ్బంది కృషితోనే ఇంత గుర్తింపు సాధించగలుగుతున్నామన్నారు.గర్వపడే స్ధాయిలో ఫలితాలు సాధించిన మా విద్యార్థులకు,సహకరించిన ఉపాధ్యాయులకు,తల్లిదండ్రులకు అయన ధన్యవాదాలు తెలిపారు. 





POLL