Janavaradhi | Online News


కోడెలపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ ర్యాలీ


సత్తెనపల్లి,జనవారధి: రాజుపాలెం మండలం ఇనుమట్ల గ్రామంలో సభాపతి కోడెల శివప్రసాద్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు.మున్సిపల్ చైర్మన్ రామస్వామి,పట్టణ అధ్యక్షులు శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి తాలూకా సెంటర్ వరకు నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ సాగింది.అనంతరం వారు మాట్లాడుతూ  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంబటి రాంబాబు,నిమ్మకాయల రాజనారాయణ,బసు లింగారెడ్డిలు కోడెలపై రాళ్లతో,కర్రలతో దాడిచేసి చంపాలని కుట్ర చేసారని ఆరోపించారు.దాడికి కారకులైన వారిని అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని వారు డిమాండ్ చేసారు.





POLL