Janavaradhi | Online News


ఎన్నికల తీరుపై నాయకులతో కోడెల సమీక్ష‌


సత్తెనపల్లి,జనవారధి:ఈనెల 11 వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరిగిన అనంతరం సోమవారం స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తన కార్యాలయంలో నాయకులతో ఎన్నికలు జరిగిన తీరుపై సమీక్షించారు. సత్తెనపల్లి పట్టణంలోని 30 వార్డులతో పాటుగా ముప్పాళ్ళ, నెకరికల్లు, రాజుపాలెం, సత్తెనపల్లి మండలాల్లో పార్టీ బాధ్యులు ఎన్నికలు జరిపించిన తీరుపై స్పీకర్ కోడెల చర్చించారు. వచ్చే నెల 23 వతేదీన జరగనున్న ఎన్నికల లెక్కింపు ఫలితాలలో గెలుపు తెలుగుదేశం పార్టీదేనని కోడెల ధీమా వ్యక్తం చేశారు.సమావేశంలో మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి,పట్టణ  పార్టీ అధ్యక్షులు చౌటా శ్రీనివాసరావు,మస్తాన్ వలి తదితరులున్నారు.

POLL