Janavaradhi | Online News


నిరాహార దీక్షను విరమిస్తున్నాం:అంబటి


నిరాహార దీక్షను విరమిస్తున్నాం:అంబటి
307 కేసును ఉపసంహరించుకోవాలి
కోడెలకు శిక్షపడే రోజులొస్తాయి
సానుభూతి కోసమే కోడెల‌ చొక్కా చించుకున్నారు.
ఘటనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళిన జగన్
ఇనిమెట్ల ప్రజానీకానికి వైసిపి అండగా ఉంటుంది.
పాత్రికేయుల సమావేశంలో వైసిపి నేత అంబటి
 
సత్తెనపల్లి,జనవారధి:ఇనిమెట్ల ఘటనలో పోలింగ్ బూత్ ఏజెంట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడెల శివప్రసాదరావుపై పోలీసులు గత్యంతరం లేని పరిస్ధితుల్లో సోమవారం రాత్రి 10.30గంటలకు  కేసు నమోదు చేశారని,ఈ నేపధ్యంలో ఈనెల 17న చేయనున్న‌ నిరాహార దీక్షను విరమిస్తున్నట్టు వైయస్సార్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు.మంగళవారం ఇనిమెట్ల ఘటనపై ఆ పార్టీ అధిష్టానం నియమించిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా,మర్రి రాజశేఖర్,బొల్లా బ్రహ్మనందరెడ్డి,అంబటి,నిమ్మకాయల రాజనారాయణ‌లు మీడియాతో మాట్లాడారు.అంబటి మాట్లాడుతూ..ఎన్నికల కోడ్ అమల్లో ఉందని తెలిసినా అనివార్య పరిస్ధితుల్లో దీక్షకు పూనుకోవాల్సి వచ్చిందన్నారు. గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడేందుకు ఒక వారం రోజులు కమిటి పర్యటనను వాయిదా వేస్తున్నామన్నారు.ఈ సందర్భంగా ఇనిమెట్ల  160 పోలింగ్ బూత్ లో జరిగిన ఘటనకు సంబంధించిన కొన్ని దృశ్యాలను విడుదల చేశారు.మరిన్ని వీడియోలు కూడా ఉన్నాయని అవి  త్వరలో బయట‌పెడతామన్నారు.
 
బూత్ లో రౌడీయుజం చేసి,ఏజెంట్లను బయట‌కు పంపించి,గన్ మెన్లతో తలుపులు వేసి కోడెల శివప్రసాదరావు సుమారు గంటన్నర సేపు లోపలే ఉన్నారని తెలిపారు.కోడెల రెచ్చగొట్టి,భయబ్రాంతులకు గురి చేసినందున,తమ ఓట్లు దొంగిలిస్తున్నారన్నఆందోళనతో  అక్కడ ఓటర్లు తిరుగుబాటు చేయాల్సివచ్చిందని వివరించారు.కేవలం సానుభూతి కోసమే కోడెల‌ తన చొక్కాను తనే చించుకున్నారని అంబటి విమర్శించారు.జిల్లా ఎస్పీ కోడెల గన్ మెన్లను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.ఈ ఘటనపై రాజుపాలెం ఎస్సైకు ఫిర్యాదు చేసినా కేసు రిజిస్ట్రర్ చేయలేదన్నారు.ఆ ఎస్సై చట్టబద్దంగా వ్యవహరించలేదని..ఉన్నాతాధికారులకు అతనిపై ఫిర్యాదు చేశామన్నారు.
 
పోలీసులు కోడెల అడుగులకు మడుగులొత్తుతున్నారని..కోడెల శాశ్వతం కాదు..చంద్రబాబు శాశ్వతం కాదని,దుర్మార్గంగా వ్యవహరిస్తే కోడెలకు జరిగిన సన్మానం భవిష్యత్తులో పోలీసులకు జరుగుతుందని హెచ్చరించారు.తమ పార్టీ కార్యకర్తలపై పెట్టిన 307 కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనపై తమ అధినేత జగన్మోహన్ రెడ్డి గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళారని పేర్కొన్నారు.త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని,కోడెల తప్పకుండా శిక్ష అనుభవించే రోజులున్నాయన్నారు.ఇనిమెట్ల ప్రజానికానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అంబటి స్పష్టం చేశారు.
 
సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షులు షేక్ నాగుల్ మీరాన్,పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ గీతా హసంతి,మక్కెన అచ్చెయ్య, మైనార్టీ నాయకులు సయ్యద్ మాబు,ఆతుకూరి నాగేశ్వరరావు,అచ్యుత శివప్రసాద్ తదితరులున్నారు. 
 
 
 

POLL