Janavaradhi | Online News


సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ బాటపట్టిన ప్రముఖులు...!


ప్రముఖులను టార్గెట్‌గా చేసుకొని సోషల్‌ మీడియాలో ఎందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారు? ఇలాంటి కథనాలు పోస్ట్ చేస్తున్న వారిని చట్టం ఎలా శిక్షిస్తుంది? మొన్న షర్మిలా , నిన్న లక్ష్మి పార్వతి , ఈరోజు సినీనటి పూనమ్ కౌర్‌లపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. వారికి మనోవేదన కలిగిస్తున్నారు. గత కొద్ది రోజులు ప్రముఖులు , సినీతారలు , సినీనటులను టార్గెట్‌ చేసుకొని సోషల్‌ మీడియాలో వారి పై అభ్యంతరకర పోస్ట్లు చేస్తున్నారు కొంత మంది కేటుగాళ్లు దీంతో వారి ప్రతిష్టకి భంగం కలగడమే కాకుండా , మానసిక ప్రశాంతత కూడా లోపిస్తోంది. దీంతో ఏంచేయాలో దిక్కు తోచక తలలు పట్టుకుంటున్నారు. చిన్న విషయాన్నీ కూడా పెద్దదిగా చేసి , ఆధారాలు లేకుండా కొన్ని వెబ్‌సైట్ లు,యూట్యూబ్ ఛానల్స్, పేస్ బుక్,వాట్సప్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు దీంతో బాధితులంతా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ బాటపట్టారు.
 
 
 





POLL