Janavaradhi | Online News


తారక్, చెర్రి ఇంట్రడక్షన్‌కి 70 కోట్లు?


రామ్‌చరణ్- ఎన్టీఆర్ కాంబోలో రానున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. దీనికి సంబంధించి ఓ కొత్త వార్త హంగామా చేస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌పై కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నాడు డైరెక్టర్ రాజమౌళి. ఇందుకోసం 22 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు ఓ ఫీలర్ బయటకు వచ్చింది. నాలుగైదు నిమిషాల్లో కొమరం భీం తన విశ్వరూపాన్ని చూపిస్తాడని అంటున్నారు. అందుకోసం హైటెక్నాలజీ కెమెరాలను వినియోగిస్తున్నారట. ఒక్క తారక్ మాత్రమే కాదు.. చెర్రీ, సెకండాఫ్‌లో కనిపించే అజయ్ దేవ్‌గన్‌ని ఆ రేంజ్‌లో చూపించనున్నట్లు యూనిట్ చెబుతోంది. అందుకే వీళ్ల ఇంట్రడక్షన్ కోసం 50 నుంచి 70 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అంతర్గత సమాచారం. అందుకే బడ్జెట్‌ని 300 కోట్ల రూపాయలుగా అంచనా వేసినట్టు చెబుతున్నారు. చెర్రీ సరసన అలియాభట్ ఓకే కాగా, ఎన్టీఆర్ పక్కన నిత్యామీనన్‌ని తీసుకునే ఛాన్స్ వుందని తెలుస్తోంది. ఇంతకీ హీరోయిన్ విషయంలో రాజమౌళి మనసులో ఏముందో చూడాలి.
 





POLL