Janavaradhi | Online News


సినీ నటుడు మురళీమోహన్ ఇంట్లో విషాదం


సినీ నటుడు, టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మురళీమొహన్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి మాగంటి వసుమతిదేవి (100) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యానికి గురికావడంతో ఆమె విశాఖపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. వసుమతీదేవి మృతదేహాన్ని రాజమహేంద్రవారంలోని జేఎన్ రోడ్‌లో ఉన్న మురళీమోహన్ నివాసానికి తీసుకురానున్నారు. శుక్రవారం ఉదయం వసుమతీదేవి అంత్యక్రియలు రాజమండ్రిలో నిర్వహించనున్నారు. మాతృవియోగంతో బాధపడుతున్న మురళీమోహన్‌ను పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పరామర్శించారు. 
 
కాగా.. ఇటీవల మురళీమోహన్ తన తల్లి వసుమతీదేవి శతవసంతోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు వసుమతీదేవి కుటుంబానికి చెందిన సుమారు 100 మందికి పైగా హాజరయ్యారు. కృష్ణాజిల్లా గుడివాడలోని గౌరీసంకరపురం గ్రామంలో వేడుకలు నిర్వహించగా.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీమోహన్ తన తల్లితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇక ఇటీవల మాతృ దినోత్సవ సందర్భంగా.. ‘తన శరీరం నుంచి ఇంకొకశరీరం పుట్టు కొస్తుందనే ఆలోచన అద్భుతంతంగా ఉంటుంది, ఆ అనుభవం ఒకతల్లికీ తప్పవేరెవరికి ఉండదు. అందుకే తల్లికి తన సంతానంపై అంత మమకారం’ అంటూ తన తల్లికి శుభాకాంక్షల్ని తెలియజేశారు మురళీమోహన్.  

POLL