Janavaradhi | Online News


చిరు సపోర్ట్ కి లారెన్స్ ఫుల్ ఖుషీ


తనకు కొరియోగ్రాఫర్‌గా చాలా సినిమాలకు సేవలందించిన రాఘవ లారెన్స్ ఉబ్బితబ్బిబ్బయ్యే పనిచేశారు మెగా స్టార్ చిరంజీవి. కొరియోగ్రాఫర్‌ గానే కాదు, దర్శకుడిగా, హీరోగా కూడా తానేంటో నిరూపించుకుంటోన్న లారెన్స్ సమాజానికి కూడా తనవంతు సాయంగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. లారెన్స్ సేవా తత్పరతకు చలించిపోయిన చిరు లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ కు రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. తన బావమరిది అల్లు అరవింద్ ద్వారా కాంచన-3 ప్రీరిలీజ్ ఈవెంట్ లో లారెన్స్ కు చెక్ అందించారు. కాంచన-3 ప్రీరిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ కూడా హాజరయ్యారు. చిరంజీవి విరాళాన్ని చెక్ రూపంలో అందుకున్న లారెన్స్ లో ఆనందం ఉప్పొంగింది.





POLL