Janavaradhi | Online News


కేసీఆర్ బయోపిక్ పై కన్నేసిన వర్మ...!


తెలంగాణా సిఎం కేసీఆర్‌పై బయోపిక్ తీస్తానని గతంలో ప్రకటించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ అందుకు రెడీ అయ్యాడు. అన్నట్టుగానే టైటిల్‌ని ఎనౌన్స్ చేశాడు. ‘ టైగర్ కేసీఆర్.. ది అగ్రెసివ్ గాంధీ ‘ అని ఈ మూవీకి టైటిల్ పెట్టినట్టు తన ట్విటర్‌లో వెల్లడించాడు. పైగా ఈ టైటిల్‌ కింద.. ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అని ఓ లైన్ కూడా జోడించాడు. మరో ట్వీట్‌లో ఇది కేటీయార్ తండ్రి బయోపిక్ అని, ఆంధ్రపాలకుల పాలనలో తెలంగాణ ప్రజల అణచివేతను తట్టుకోలేని కేసీఆర్ ప్రత్యేక రాష్ర్టాన్ని ఏ విధంగా సాధించారో అన్న విషయాలను చిత్రంలో చూపించబోతున్నట్టు పేర్కొన్నారు. త్వరలో ఈ బయోపిక్ కు సంబంధించి వర్మ వివరాలను ప్రకటించే అవకాశముంది.





POLL