Janavaradhi | Online News


‘జెర్సీ’ ట్విట్టర్ రివ్యూ పాజిటీవ్ రెస్పాన్స్


‘ఇంతపెద్ద ప్రపంచంలో నన్ను జడ్జ్ చేయని వాడు నా కొడుకు ఒక్కడే.. వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను’ అంటూ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ నుండి రిటైర్డ్ అయ్యే వయసులో బ్యాట్ చేతబట్టి గ్రౌండ్‌లో సిక్స్‌ల మోత మోగిస్తూ.. జీవిత పాఠంతో కూడిన ఎమోషనల్ జర్నీని ‘జెర్సీ’ చిత్రంతో అందించేందుకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు నేచురల్ స్టార్ నాని నాని కెరియర్‌లోనే ఇంతకు ముందెన్నడూ లేనంత పాజిటివ్ బజ్‌తో నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది జెర్సీ టీజర్, ట్రైలర్‌లలోనే సినిమా స్థాయి ఏంటో ఓ క్లారిటీ ఇచ్చేశారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. 
 
ఈ చిత్రంలో క్రికెటర్ అర్జున్‌గా నాని వీరబాదుడు చూస్తుంటే ఈసారి గట్టి హిట్ కొట్టేట్టు కనిపిస్తున్నాడు. ఓ సినిమా కోసం నాని ఇంతిలా శ్రమపడటం బహుషా ఇది తొలిసారి. ‘మళ్ళీ రావా’ చిత్రంతో దర్శకుడిగా ప్రశంసలు అందుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని క్రికెటర్ అర్జున్‌ (36)గా కనిపిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నానికి జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళ సంచలనం అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు. 





POLL