Janavaradhi | Online News


నయనతార ప్లేసులో అనుష్క..!


మణిరత్నం న్యూ ప్రాజెక్టు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మల్టీస్టారర్‌గా రానున్న ఈ చిత్రాన్ని ‘పొన్నియన్‌ సెల్వన్‌’ బుక్ ఆధారంగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్. ఇందులో నయనతార కీలకపాత్ర పోషిస్తున్నట్లు తొలుత వార్తలొచ్చాయి. ఇప్పుడు విజయ్‌, రజనీకాంత్‌ సినిమా షూటింగ్‌లతో డేట్స్‌ సెట్స్ కాకపోవడంతో ఆమె తప్పుకున్నాట్లు సమాచారం. ఈ క్రమంలో అనుష్కను మణిరత్నం సంప్రదించడం, ఆమె ఓకే చేయడం జరిగినట్టు కోలీవుడ్ మాట. ఈ రోల్ కోసం తొలుత అనుష్కని తీసుకోవాలని ప్లాన్ చేశారు, ఆమె సుముఖంగా లేదు. అదృష్టం మళ్లీ అనుష్కను వరించింది. ఈ ప్రాజెక్టులో తెలుగు, తమిళం, బాలీవుడ్‌కి చెందిన నటీనటులు సందడి చేయనున్నారు. మద్రాస్‌ టాకీస్- లైకా ప్రొడక్షన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఫిల్మ్‌కి రెహమాన్‌ మ్యూజిక్ డైరెక్టర్. ప్రస్తుతం అనుష్క ‘సైలెన్స్’ ప్రాజెక్టుతో బిజీగా వుంది.





POLL