Janavaradhi | Online News


గుండెపోటుతో మృతిచెందిన తెదేపా నేత పోట్ల‌


గుండెపోటుతో మృతిచెందిన తెదేపా నేత పోట్ల‌
నివాళి అర్పించిన పలువురు నేతలు/span>
 
సత్తెనపల్లి:పట్టణానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది తెలుగుదేశం పార్టీ నాయకులు పోట్ల సుబ్బారావు గుండెపోటుతో సోమవారం మృతిచెందారు.అస్వస్ధతకు లోనుకాగానే పట్టణంలోని ప్రవేట్ వైద్యశాలలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందారు.ఆయన మృతి చెందిన వార్త తెలుసుకుని తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు,చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్,తెదేపా యువనేత కోడెల శివరాం,తెదేపా రాష్ట్ర కార్యదర్శి రాయపాటి రంగారావు , వైసిపి రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ‌ తదితరులు పోట్ల నివాసానికి చేరుకుని పార్ధివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానూభూతి తెలిపారు.
 
 
 
తెలుగుదేశం పార్టీలో గతంలో నియోజకవర్గ ఇంచార్జ్ గా చేసిన ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు.పోట్ల లేని లోటు తీర్చలేనిదన్నారు.వారితో పాటు జిల్లా తెలుగు యువత నాయకులు నాగమల్లేశ్వరరావు, పలువురు న్యాయవాదులు,పట్టణ ప్రముఖులు తదితరులున్నారు.
 





POLL