Janavaradhi | Online News


రజినీ ‘దర్బార్’ సెట్‌పై రాళ్ల దాడి


రజినీకాంత్- మురుగదాస్ కాంబోలో రానున్న మూవీ ‘దర్బార్’. ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుగు తోంది. ఐతే, ఈ చిత్రం షూటింగ్ స్పాట్‌కి కొంద‌రు స్టూడెంట్స్ వెళ్లారు. షూటింగ్ చూసేందుకు వచ్చిన విద్యార్థులు.. తమ ఫోన్లలో అక్కడి దృశ్యాలను తీస్తున్నారు. దీంతో యూనిట్ సభ్యులు వాళ్లని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో యూనిట్- స్టూడెంట్స్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తంచేస్తూ సెట్స్‌పైకి రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కానప్పటికీ, విషయాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు డైరెక్టర్ మురుగదాస్. సినిమా ఫొటోలు లీక్ కావడంతో అసంతృప్తికి లోనై, వెంటనే లొకేషన్ మార్చాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. చాలా కాలం త‌ర్వాత ర‌జినీకాంత్ పోలీస్ అధికారిగా కనిపిస్తున్నాడు. లైకా ప్రొడ‌క్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో న‌య‌న‌తార హీరోయిన్.





POLL