Janavaradhi | Online News


అందరి ముందు సెక్స్ చేయలేం కదా...జీవిత!


ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఆవిష్కరణ తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీవిత... ట్రైలర్ చూసి షాకయ్యారు. సినిమాలో శృతి మంచిన శృంగార సీన్లు, లిప్ లాక్ సీన్లు ఉండటంపై ఏకిపారేశారు. ''ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీరు నా లాంటి రాంగ్ పర్సన్‌ను పిలిచారు అనిపించింది. నేను సెంట్రల్ సెన్సార్ బోర్డ్ మెంబర్‌.. మీ సినిమా ఇంకా సెన్సార్ కాలేదనుకుంటున్నా. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాల పుణ్యమా అని లిప్ లాక్ లేకుండా తెలుగు సినిమా లేదు అనే విధంగా పరిస్థితి దిగజారిపోయిందని ఫీలవుతున్నాను'' అని జీవిత వ్యాఖ్యానించారు.
 
‘‘మీ సినిమా కార్యక్రమానికి వచ్చి నేను ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు.. నేను చూసిన దాంట్లో నాలుగైదు షాట్లు, అవే.. మీ పోస్టర్ అదే.. కానీ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏదైనా కవర్డ్‌గా ఉన్నంతవరకే అందం. ఉదాహరణకు మనం ఇల్లు కట్టుకుంటే బాత్రూంలో స్నానం చేస్తాం, బెడ్రూంలో పడుకుంటాం. హాలులో కూర్చుంటాం. హాలులో వచ్చి స్నానం చేయం. ప్రతి మనిషి జీవితంలో శృంగారం ఉంటుంది, సెక్స్ ఉంటుంది... అన్నీ ఉంటాయి. అవి ఎక్కడ చేయాలో అక్కడ చేస్తేనే బావుంటుంది. పబ్లిగ్గా రోడ్డు మీద చేస్తే చాలా అసహ్యంగా ఉంటుంది'' అని జీవిత చెప్పుకొచ్చారు.
 
ఈ రోజుల్లో ప్రతి సినిమాలో లిప్ లాక్ తప్పనిసరి అనే విధంగా తయారైంది. బట్టలిప్పుకోవడం, అమ్మాలు అబ్బాయిల మీద ఎక్కి కూర్చోవడం.. సీన్లు కామన్ అయిపోయాయి. ఇది మీ జీవితంలో లేదా? అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. కానీ మనం రోడ్డు మీద అలాంటి పనులు చేయం. ముందు నుంచీ మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అలా ఎందుకు చేయకూడదు అని అడ్డంగా మాట్లాడే దర్శకులతో మనం వాదించలేం. ప్రతి ఒక్కరూ ఒక విషయం అర్థం చేసుకోవాలి... సోషల్ మీడియాలో, టీవీల్లో ఇలాంటివి ఉండటం లేదా? అంటే... ఉంటున్నాయి. అవి మనం ఒక రూములో, ఒక్కరం కూర్చుని చూస్తాం. 
 
సినిమా అనేది కొన్ని వందల మందితో కలిసి చూసేది. కొన్ని వందల మంది మధ్యలో మనం శృంగారం చేయం. అసభ్యంగా ప్రవర్తించం. మూవీలో ఇలాంటివి వచ్చేసరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటివి వచ్చినపుడు సెన్సార్ ఏం చేస్తుంది అని కొందరు అంటారు. కానీ సెన్సార్ వారికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇది వద్దండీ అంటే పెద్ద గొడవ చేస్తారు. సెన్సార్ బోర్డు మీద ప్రెస్ మీట్లు పెట్టి సినిమాను ఆపేస్తున్నారని గంధరగోళం చేస్తున్నారు, కోర్టులకు వెళుతున్నారని జీవిత గుర్తు చేసుకున్నారు.





POLL