Janavaradhi | Online News


బాలీవుడ్‌కి షాకిచ్చిన ‘అవతార్ 2’...!


‘అవతార్ 2’ ప్రాజెక్టుపై మరింత క్లారిటీ ఇచ్చేశాడు హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్. ఈ చిత్రాన్ని 2021, డిసెంబర్ 17న రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. టైటిల్‌ని ప్రకటించనప్పటికీ ‘అవతార్.. ది వే ఆఫ్ వాటర్’ అనే పేరుని ఖరారు చేసే ఛాన్స్ వుందని హాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మూవీ ప్రధానంగా పాండోరా గ్రహం మీదున్న సముద్రాల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇక కామెరూన్ ప్రకటించిన తేదీతో బాలీవుడ్ అలర్టయ్యింది. నార్మల్‌గా అయితే డిసెంబర్ మూడు, నాలుగో వారంలో బాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలు ఎక్కువగా రిలీజవుతాయి. కానీ, డేట్స్ విషయంలో విభేదాలు రాకుండా వుండేలా రెండేళ్లు ముందుగానే వెల్లడించాడు జేమ్స్. 
 
దీంతో బాలీవుడ్ హీరోలు అవతార్ కంటే ముందుగానే తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ముంబై సమాచారం. అవతార్ తొలిపార్ట్‌ని రూ.1,648 కోట్లతో తెరకెక్కించగా రూ.20,455 కోట్లు సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే! సహజ వనరుల కోసం మనుషులు పాండోరా గ్రహానికి వెళ్లడం, అక్కడ నావీ అనే జాతికి చెందినవాళ్లతో యుద్ధం వంటి ఆసక్తికరమైన మలుపుతో అద్భుతంగా తీర్చిదిద్దాడు. దీనికి మరో నాలుగు సీక్వెల్స్ ఉంటాయని అప్పట్లో ప్రకటించాడు కామెరూన్.

POLL