Janavaradhi | Online News


అపోహలొద్దు అండగా ఉంటా:యర్రం


అపోహలొద్దు అండగా ఉంటా
కష్టపడ్డ ప్రతీ కార్యకర్తను గుర్తుంచుకుంటా
స్ధానిక ఎన్నికలకు సిద్ధమవ్వాలి:యర్రం
 
సత్తెనపల్లి,జనవారధి: గెలుపోటములతో సంబంధం లేకుండా ఫలితాల అనంతరం కూడా నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉంటానని,సమస్యలపై పోరాటానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని మాజీ ఎమ్మెల్యే జనసేన అభ్యర్ధి యర్రం వెంకటేశ్వరరెడ్డి అన్నారు.గురువారం స్ధానికంగా జరిగిన‌ నియోజకవర్గ స్ధాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఆయనతో పాటు జనసేన నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్ధి కమల్ నాయబ్ కూడా వేదికపై ఉన్నారు.
 
ఈ సందర్భంగా యర్రం మాట్లాడుతూ..తక్కువ సమయంలో పోటీ చేయటం వల్ల అన్నీ గ్రామాల్లో పర్యటనలకు రాలేకపోయామన్నారు.కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరిని గుర్తుంచుకుంటానని,అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చించిన అనంతరం అంతర్గత కమిటీలు ఏర్పాటు చేస్తానన్నారు.పార్టీ శ్రేణులందరు స్ధానిక ఎన్నికలకు సమర్ధవంతంగా సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.
 
 
ఎంపి అభ్యర్ధి నాయబ్ మాట్లాడుతూ..అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేశానని పేర్కొన్నారు.ఎన్నికలకు కేవలం పది రోజుల సమయం మాత్రమే ఉండటంతో పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాల్లో పర్యటించలేకపోయానని,జనసైనికులు అర్ధం చేసుకోవాలని కోరారు.పలువురు కార్యకర్తలు ఈ ఎన్నికల్లో తమ అనుభవాలను వెలిబుచ్చారు.
 
 
ఈ సమావేశానికి తాళ్ళూరి మోహనబాబు అధ్యక్షత వహించారు.సమావేశంలో తవిటి భావన్నారాయణ,కొమ్మిశెట్టి సాంబశివరావు,సుబ్రహ్మణ్యంలు ప్రసంగించారు.వాకుమళ్ళ చెంచిరెడ్డి,రాయ వెంకట్రామిరెడ్డి,వీరమహిళలు సౌజన్య,లక్ష్మీతదితరులు ప్రసంగించారు.

POLL