Janavaradhi | Online News


చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని.. రాయపాటి యాగం


మాచవరం,జనవారధి:- నవ్యాంధ్ర అభివృద్ధి కాంక్షిస్తూ రాష్ట్ర ప్రజానీకం ఆకాంక్షల మేరకు తిరిగి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు మొర్జoపాడు శ్రీ బుగ్గ మల్లేశ్వరస్వామి క్షేత్రంలో గురువారం నాడు శత చండీయాగం, మహా సుదర్శన యాగాలు నిర్వహించారు. రాజుపాలెం మండలం నెమలిపురి గ్రామానికి చెందిన ప్రముఖ వేద పండితులు  చల్లా శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో రుత్వికులు శాస్త్రోక్తంగా యాగ కృతువు నిర్వహించారు.

 

గురువారం ప్రారంభమైన ఈ యాగం ఐదో రోజయిన పూర్ణాహుతితో యాగ పరి సమాప్తి అవుతుందని శ్రీనివాసశర్మ తెలిపారు. ఈ సందర్భంగా రాయపాటి మాట్లాడుతూ రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు హయాంలో నిర్మితమైన శ్రీ బుగ్గమల్లేశ్వరస్వామీ శ్రీశైల దేవస్థానంలో సమానమైన ప్రసాథ్యం పొందిందని క్షేత్ర సందర్శన తనకు ఎంతో ఆనందం కలిగించిందని రాయపాటి పేర్కొన్నారు. క్షేత్రంలో బుగ్గ మల్లేశ్వరుడి వద్ద తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తను యాగం నిర్వహించుతున్నట్లు రాయపాటి తెలిపారు.





POLL