Janavaradhi | Online News


‘ఎవెంజర్స్ అమ్మ మొగుడు వస్తున్నాడు కాచుకోండి’: కేటీఆర్


‘ఎవెంజర్స్ అమ్మ మొగుడు వస్తున్నాడు కాచుకోండి’ అంటూ సవాల్ విసురుతున్నారు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. గ్రీన్ గోల్డ్ టీవీ రూపొందించిన ‘చోటాభీమ్ కుంగ్ ఫు ధమాకా’ అనే ఫీచర్ మూవీకి కేటీఆర్ పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ‘ఇది మన లోకల్ ఎవెంజర్స్ మూవీ.. కానీ.. ఎండ్ గేమ్ కాదు.. ఈనెల 10న థియేటర్లలోకి వస్తోంది. అందరూ ఆదరించండి’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇంతకీ కేటీఆర్‌కీ ఈ చోటా భీమ్‌కీ లింకేమిటి? ‘చోటా భీమ్’ కార్టూన్ సృష్టికర్త, ఇప్పుడు తీస్తున్న తాజా ఫీచర్ మూవీ నిర్మాణ సంస్థ ‘గ్రీన్ గోల్డ్ టీవీ’ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో వుంది. అందుకే ఇది మన ప్రాడక్ట్.. పక్కా లోకల్.. అంటూ స్లోగన్ ఎత్తుకున్నారు కేటీఆర్.





POLL