Janavaradhi | Online News


నాన్న ఆశయాన్ని నెరవేర్చా: కిడారి శ్రావణ్‌


అనూహ్య సంఘటనల నేపథ్యంలో ఊహించని విధంగా సీఎం చంద్రబాబునాయుడు తనకు మంత్రిగా అవకాశం కల్పించారని, ఆరు నెలల పదవీ కాలంలో గిరిజనులకు సేవ చేసుకునే భాగ్యం లభించిందని కిడారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. ఆయన ఇటు ఎమ్మెల్యేగా, అటు ఎమ్మెల్సీగా లేకపోవడంతో రాజ్యాంగం ప్రకారం ఆరు నెలలకు మించి మంత్రిగా వుండడానికి వీలు లేదు. దీంతో గురువారం అమరావతి వెళ్లి సీఎం చంద్రబాబును కలిసి, రాజీనామా లేఖను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా అరకులోయ విలేకర్లకు ఒక లేఖను పంపారు. 
 
గిరిజనులకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇవ్వాలన్నది తన తండ్రి ఆశయమని, తాను మంత్రిని అయిన తరువాత ఈ విషయాన్ని సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేయించారని చెప్పారు. దీంతో తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చడం ఎంతో తృప్తినిచ్చిందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు తమ కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలిచారంటూ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అరకులోయ ఏరియా ఆస్పత్రిని 150 పడకలకు, పాడేరు ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా మార్చి 200 పడకల స్థాయికి పెంచడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. మంత్రిగా తనకు అన్ని విధాలా సహకరించిన అధికారులకు, సిబ్బందికి, తనను అభిమానించి అక్కున చేర్చుకున్న మన్యం ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాన్నానని పేర్కొన్నారు.





POLL