Janavaradhi | Online News


'అది చూసి బాబు కుమిలికుమిలి ఏడుస్తారు''..లక్ష్మిపార్వతి!


వర్మ ఎంతో శ్రమకోర్చి తెలంగాణ తెరకెక్కించిన పొలిటికల్ సెటైరికల్ మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ని ఏపీ ప్రేక్షకులకు చూపించేదాకా విశ్రమించబోనంటోంది వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లక్ష్మీపార్వతి. ఎన్నో అవాంతరాల్ని ఎదుర్కొని చివరకు ఈనెల 19న విడుదల కావడానికి సిద్ధంగా వున్న ఈ మూవీని మళ్ళీ అడ్డుకోడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారామె. డైరెక్టర్ వర్మకు వెన్నుదన్నుగా ఉంటూ.. లక్ష్మీస్ ఎన్టీయార్ మూవీని ఏపీ ప్రేక్షకుడికి దగ్గర చేసేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తానని మాటిచ్చారు లక్ష్మీపార్వతి. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమి ఖాయమని, జగన్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఘంటాపథంగా చెప్పారు ల‌క్ష్మీపార్వ‌తి. ఛానళ్ల సర్వేలన్నీ వైసీపీకే అనుకూలంగా ఉన్నాయని, జగన్ సీఎం కాబోతున్నారని, ఆ ఘట్టాన్ని చూసి చంద్రబాబు కుమిలిపోతారన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితానికి అక్కడే ఎండ్ కార్డ్ పడనుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రస్థానం కూడా అక్కడితోనే ముగిసిపోతుందని శాపం పెట్టారు లక్ష్మీపార్వతి.
 





POLL