Janavaradhi | Online News


తలుపు తడుతున్న మొసలి...


కాలింగ్‌ బెల్‌ మోగగానే హడావిడిగా వెళ్లి తలుపు తీస్తున్నారా? దక్షిణ కరోలీనాలో జరిగిన ఈ ఘటన గురించి తెలిస్తే.. ఇకపై తలుపు తెరిచేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారేమో! ఎందుకంటే ఆరున్నర అడుగుల పొడవున్న మొసలి కాలింగ్‌ బెల్‌ కొట్టింది మరి! నమ్మశక్యంగా లేకపోయినా.. మిర్టిల్‌ బీచ్‌కు సమీపంలో కరెన్‌ ఆల్ఫానో అనే మహిళ ఇంటివద్ద ఈ వింత నిజంగా చోటుచేసుకుంది. ఆమె పొరుగింటి వాళ్లు ఈ దృశ్యాన్ని తమ ఫోన్లలో బంధించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. కాగా.. స్థానికులు జంతు సంరక్షణ కేంద్రానికి సమాచారమివ్వడంతో.. అధికారులు మొసలిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.





POLL