Janavaradhi | Online News


నేను తప్పు చేశా : ప్రియాంక గాంధీ


గతంలో తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేదని.. ఆ విషయంలో తాను తప్పు చేశానని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. ‘ప్రజాస్వామ్యం, వ్యవస్థలు కష్టాల్లో ఉన్నప్పుడు పారిపోతే అది పిరికితనం అవుతుంది.. నేను అలాంటి దాన్ని కాదు. నన్ను రాజకీయాల్లోకి రమ్మని రాహుల్‌ గతంలో ఆహ్వానించినా నేను తిరస్కరించి తప్పు చేశా. అప్పట్లో రాహుల్‌పార్టీ జనరల్‌ సెక్రటరీ లేదా యూపీలో పార్టీ పగ్గాలు కానీ తీసుకోవాలని కోరారు. కానీ మనిషి తప్పుల నుంచి నేర్చుకుంటారు. అందుకే రెండో సారి అడగ్గానే రాజకీయాల్లోకి వచ్చా. ఇప్పుడు నేను మరిన్ని బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా.’ అని ప్రియాంక తాజాగా నిర్వహించిన యూపీ పర్యటనలో చెప్పారు.





POLL