Janavaradhi | Online News


స్టేజ్ మీద కొట్టుకున్న వీహెచ్-నగేశ్


ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ తీరును ఖండిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమం రచ్చరచ్చైంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హనుమంతరావు, ఆ పార్టీ అధికార ప్రతినిధి నగేశ్‌ మధ్య గొడవ జరిగింది. వేదిక మీద కుర్చీలో కూర్చునే విషయంలో ఒకరినొకరు తోసుకొని.. కుర్చీలో కూర్చునేందుకు ఇద్దరు నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలో వీహెచ్‌, నగేశ్‌ వేదిక మీదే పరస్పరం బాహాబాహీకి దిగారు. పరస్పరం తోసుకుంటూ కింద పడ్డారు.
 
దీంతో ఆగ్రహానికి లోనైన హనుమంతరావు నగేశ్‌పై చేయిచేసుకున్నారు. వేదిక మీదనే ఇద్దరు నేతలు తోపులాటకు, ఘర్షణకు దిగడంతో కొంతసేపు గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ధర్నా కార్యక్రమంలో కోదండరామ్‌తోపాటు చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కే, నారాయణ, టీడీపీ నేత ఎల్ రమణ తదితరులతోపాటు,కాంగ్రెస్‌ నేతలు కుంతియా, షబ్బీర్ అలీ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు కూడా పాల్గొన్నారు.
 

 





POLL