Janavaradhi | Online News


నూటికి నూరుశాతం చంద్రబాబే సీఎం...ప్రత్తిపాటి పుల్లారావు


నూటికి నూరు శాతం మరలా చంద్ర బాబే ముఖ్యమంత్రి అవు తారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట - నరసరావు పేట రహదారి సమీపంలోని కనపర్రు గ్రామ పరిధిలో నిర్మించిన శ్రీ పుష్పావతి ఆగ్రోటెక్‌ ప్రారంభ కార్యక్రమంలో శుక్రవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సం దర్భంగా సభలో పుల్లారావు మాట్లాడారు. వైసీపీ నాయకులు భ్రమలలో ఉన్నారని వారి కోరిక నెరవేరదన్నారు. టీడీపీ అత్యధిక సీట్లలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారని తెలి పారు. నరసరావుపేట ఎంపీగా పోటీ చేసిన ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా విజయం సాధిస్తారని ఆయన వివరించారు.
 
 కార్యక్రమంలో ఎంపీ రాయపాటి, ఐటీసీ సీఈవో సంజీవ్‌రంగరాస్‌, ఆంధ్రా బ్యాంకు డీజీఎం పీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, టీడీపీ నాయ కులు రాయపాటి రంగబాబు, డైరెక్టర్‌లు నాతాని వెంకటేశ్వరరావు, కనుమూరి బాజి చౌదరి, కోమటినేని నాసరయ్య, బొల్లు రాఘ వయ్యచౌదరి, నాతాని నాగేశ్వరరావు, కనపర్తి హనుమయ్య, పోపూరి వీరరాఘవయ్య, ఏఎంసీ చైర్మన్‌ సుభాని, బాష్యం రామకృష్ణ, నల్లపాటి రాము, పులిమి రామిరెడ్డి, బండారు పల్లి సత్యనారాయణ, గరికపాటి వెంకట్రావు, వజ్జా సింగయ్య, నల్లమోతు హరిబాబు, వాసిరెడ్డి రవి, సీతారామయ్య, నాగోతు శౌరయ్య, గోగినేని కోటేశ్వరరావు పాల్గొన్నారు.





POLL