Janavaradhi | Online News


ఖ‌రారైన స్టాలిన్‍‍.. కేసీఆర్ భేటీ...


ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతును కూడగట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణా సీఎం కేసీఆర్.. సోమవారం చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ తో భేటీ కానున్నారు. దక్షిణాది రాష్ట్రాల పర్యటనకోసం బయల్దేరేముందు కేసీఆర్..స్టాలిన్‌ను కలిసేందుకు వస్తున్నట్టు గత సోమవారమే డీఎంకే శ్రేణులకు తెలిపారు. ఫోన్‌లో స్టాలిన్‌తో కూడా మాట్లాడారు. స్టాలిన్ వెంటనే స్పందించి.. ఈ నెల 13 న చెన్నై రావాలని ఆహ్వానించారు. వీరిద్దరి భేటీపై తమిళ మీడియా సందేహాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పైగా కేసీఆర్ చెన్నై టూర్ ప్రశ్నార్థకంగా మారింది. కేరళ వెళ్ళిన ఆయన..తమిళనాడులోని రామేశ్వరాన్ని సందర్శించి అక్కడి రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి శుక్రవారం సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్..మళ్ళీ తమిళనాడు విజిట్ చేస్తారా అన్న సందేహాలు తలెత్తాయి. అయితే.. ఈ అనుమానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ.. మొత్తానికి ఆయన చెన్నై టూర్ ఖరారైంది. 





POLL