Janavaradhi | Online News


మీరా మాకు నీతులు ప్రబోధించేది...చంద్రబాబు!


‘‘రాజకీయ లాభం కోసం ఎప్పుడో చనిపోయిన నాయకులను, వారి కుటుంబ సభ్యులను కూడా కించపర్చడానికి ప్రధాని మోదీ వెనకాడటం లేదు. అలాంటి ట్రాక్‌ రికార్డ్‌ ఉన్న వ్యక్తి మాకు నీతిపన్నాలు ప్రబోధిస్తారు’’ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన వరుస ట్వీట్‌లు చేశారు. ‘‘రక్షణ శాఖను, సైన్యాన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొంటారు. మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ నాయకత్వాన్ని చంపేస్తారు. అంపైర్లు లేకుండా చేసి రిఫరీ వ్యవస్థనే ధ్వంసం చేసేలా వ్యవహరిస్తున్న మోదీ టీంకు ఈ ఎన్నికల్లో పరాజయం తప్పదు. మే 23న వెలువడే ఫలితాల్లో దేశ ప్రజలు ప్రధానిగా మోదీని, అతని టీంను తిరస్కరించడం ఖాయం. 
 
నిబంధనల ప్రకారం సక్రమంగా ఆడే కొత్త టీంను ప్రజలే ఎంపిక చేసుకొంటారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొంటారు’ అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ పూర్తి కావడానికి 73 రోజులు సమయం తీసుకొన్న ఎన్నికల కమిషన్‌కు వీవీ ప్యాట్ల లెక్కింపు పూర్తి చేయడానికి మరో ఆరు రోజులు తీసుకోవడానికి ఎందుకంత అభ్యంతరం? 50 శాతం వీవీ ప్యాట్లు లెక్కపెట్టాలని ఈసీని ప్రతిపక్షాలు అడిగితే మోదీకి ఏం సంబంధం? ఆయన ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? మా పోరాటం ఎన్నికల సంఘంపై కాదు. మా పోరాటం అధికారుల వివక్షత, పక్షపాత ధోరణిపైనే’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
 





POLL