Janavaradhi | Online News


పీఆర్ పి పార్టీలా జనసేన అవ్వదు...పవన్ కల్యాణ్!


ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. నిన్న మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పవన్ ప్రజారాజ్యం పార్టీపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీపై ఈ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా ప్రజారాజ్యం పార్టీపై ఉద్దేశ పూర్వకంగా కొన్ని కుట్రలు చేసిన వైనాన్ని జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ వివరించారు. కేవలం తమ పార్టీని భవిష్యత్తు తరాల్ని దృష్టిలో ఉంచుకుని ఆదర్శవంతమైన రాజకీయం చేయాలని పవన్ నేతలకు సూచించారు. అయితే చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలాగానే పవన్ కూడా జనసేన పార్టీని ఏదో ఒక పార్టీలో విలీనం చేస్తాడన్న వార్తలపై కూడా పవన్ స్పందించినట్లు సమాచారం. 
 
భవిష్యత్ కార్యక్రమాలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థాయిలో పార్టీ బలోపేతంపై పవన్ నేతలకు దిశా నిర్దేశం చేశారు. వివిధ అంశాలపై పవన్ భవిష్యత్ వ్యూహాలను వివరించారు. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల అనుభవాలు, ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. గత 2008 ఆగష్టు 26న తిరుపతి వేదికగా చిరంజీవి ప్రజారాజ్యం అనే ప్రాంతీయ పార్టీని స్థాపించి 2009 ఎన్నికల రణరంగంలో దిగారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి కేవలం 18 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఆ తర్వాత పార్టీలో లుకలుకలు ప్రారంభమమై పీఆర్పీ నుండి బయటకు వచ్చారు. దీంతో 2011లో కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీని విలీనం చేసిన విషయం తెలిసిందే. అన్న బాటలో తమ్ముడు కూడా నడుస్తాడు అని ఉహాగానాలకు చెక్ పెడుతూ పవన్ పార్టీ అభ్యర్థులతో మంతనాలు జరిపారు. ఇక త్వరలో ఉత్తరాంధ్రలో జనసేనాని పర్యటించనున్నట్లు సమాచారం.
 
 





POLL