Janavaradhi | Online News


నేడు విడుదలైన పదోతరగతి ఫలితాలు..


తెలంగాణ‌లో పదోతరగతి పరీక్ష ఫలితాలు సోమవారం (మే 13) విడుదలయ్యాయి. ఉదయం 11.30 గంటలకు సచివాలయం డి-బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. గ్రేడింగ్ విధానంలోనే ఫలితాలను విడుదల చేశారు. పదోతరగతి పరీక్షలకు మొత్తం 5,52,280 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. మొత్తం 5,46,728 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 5,06,202 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.   ఈసారి పదోతరగతి ఫలితాల్లో మొత్తం 92.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలికలు 93.68 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 91.18 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో జగిత్యాల జిల్లా 99.73 ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా.. హైదరాబాద్ జిల్లా 89.09 ఉత్తీర్ణతతో చివరిస్థానంలో నిలిచింది. 

POLL