Janavaradhi | Online News


గెలిచేశామన్న భ్రమల్లో జగన్‌: బుద్దా వెంకన్న‌


ఫలితాలు రాకముందే గెలిచేశామనే భ్రమల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ బతుకుతున్నాడని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవాచేశారు. 2014 లోనూ ఇలాగే మేకపోతు గాంభీర్యం పోయి తోక ముడిచాడన్నారు. విజయసాయిరెడ్డి ట్విటర్‌ పులిగా మారి పిచ్చికూతలు కూస్తున్నాడని ధ్వజమెత్తారు. డేరా బాబాకు, విజయసాయికి మధ్య సంబంధం ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 23 నుంచి జగన్‌ లోటస్‌ పాండ్‌కే పరిమితమవడం ఖాయం అని చెప్పారు. ఫలితాల తరువాత జగన్‌ ఫ్యాన్‌ వాడడమే మానేస్తారని తెలిపారు. తుది శ్వాసవిడిచే వరకు చావైనా, బతుకైనా చంద్రబాబుతోనే అడుగులు వేస్తామన్నారు.





POLL